వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా జాన్ కెల్లీ
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులైన జాన్ కెల్లీ బాధ్యతలు స్వీకరించారు. వైట్ హౌస్ సిబ్బంది కార్యకలాపాలపై ఆయనకు పూర్తి అధికారం వుంటుందని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆంథోనీ స్కారాముక్కీని తొలగించిన కొద్దిసేపటికే కెల్లీ ఈ బాధ్యతలు స్వీకరించటం విశేషం. అధ్యక్షుడి అల్లుడు జాన్ కుష్నర్, కుమార్తె ఇవాంకా ట్రంప్, వ్యూహకర్త స్టీవ్ బెనస్ కెల్లీకి రిపోర్ట్ చేస్తారని వైట్‌హౌస్ తన ప్రకటనలో వివరించింది.








