బిల్ గేట్స్ స్థానంలో జెఫ్ బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. కంపెనీ షేరు ధర భారీగా పెరగడంతో సంపదలో కొన్నేళ్లుగా ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ వ్వవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించి ఆయన స్థానంలో జెఫ్ బెజోస్ నిలిచినట్లు ఫోర్బ్స్ మేగజైన్ వెల్లడించింది. బెజో నెట్‌వర్త్ 9050 కోట్ల డాలర్లు ఉండగా గేట్స్ సంపద 9,000 కోట్ల డాలర్లుగా ఉంది. అమెజాన్‌లో బెజోస్‌కు దాదాపు 17 శాతం వాటా ఉంది. ఇ-కామ్ సంస్థగా ఆవిర్భవించినప్పటికీ కంప్యూటింగ్, ఆన్లైన్ వీడియో, కంప్యూటింగ్ హార్డ్‌వేర్, ఆప్టిఫిషల్ ఇంటెలీజెన్స్ వంటి రంగాల్లోకి విస్తరించింది.








