ఎపిలో జన్మభూమి పనులను సమీక్షించనున్న జయరామ్ కోమటి
ఉత్తర అమెరికా లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి పథకం కింద చేపట్టిన పనులను పర్యవేక్షించేందుకు రాష్ట్రానికి వచ్చారు. తన పర్యటనలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులతో ఆయన ఈ సందర్భంగా భేటీ అవుతారు. అధికారులతో చర్చలు జరిపి, పనుల ప్రగతిని తెలుసుకుంటారు.








