మిల్పిటాస్లో ఘనంగా జయరామ్ కోమటి జన్మదిన వేడుకలు
అమెరికా కమ్యూనిటీకి ఎల్లప్పుడూ చేదోడువాదోడుగా ఉంటూ, జన్మభూమి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ ఉన్న ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి జన్మదిన వేడుకలను మిల్పిటాస్లో ఘనంగా నిర్వహించారు. మిల్పిటాస్లోని స్వాగత్ హోటల్లో జరిగిన ఈ వేడుకలకు ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. తానా నాయకులు, ఎన్నారై టీడిపి నాయకులు, బాటా నాయకులతోపాటు ఇతర ఎన్నారై ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొని జయరామ్ కోమటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తానా నాయకుడు సతీష్ వేమూరి, రజనీకాంత్ కాకరాల, వినయ్ పరుచూరి, జనార్థన్ నిమ్మలపూడి, వెంకట్ కోగంటి, విజయ ఆసూరి, భాస్కర్, సందీప్, హరికృష్ణ నల్లమల, ఉమ ఉప్పలపాటి, వినయ్ పరుచూరి, రామ్ తోట, ప్రసాద్ మంగిన, కళ్యాణ్ కట్టమూరి తదితరులు వేడుకల్లో పాల్గొన్నవారిలో ఉన్నారు.













