సెల్ఫీతో కామెర్ల వ్యాధి గుర్తింపు
సెల్ఫీ దిగి మన హావాభావాల్ని చూసుకుంటూ మురిసిపోతాం. అదే సెల్ఫీ మన రోగాన్ని గుర్తిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో బిలిస్క్రీన్ సెల్ఫీ యాప్ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ యాప్ను మన స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని సెల్ఫీ దిగితే చాలు. కంప్యూటర్ విజన్ అల్గారిథం, మెసీన్ లర్నింగ్ సాధనాల సాయంతో కళ్లల్లో కనిపించే కంటే ముందే కామెర్లు, ఇతరత్రా రోగాల్ని అది ఇట్టే పసిగడుతుందట. కంటి శ్వేత నేత్ర పటలంపై పడే కెమెరా కాంతితో ఇది సాధ్యమని శాస్త్రవేత్తలు వివరించారు.













