మహిళా ఓటర్ గా డొనాల్డ్ ట్రంప్ అల్లుడు!
అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, శ్వేతసౌధం సలహాదారు జారెద్ కుష్నర్ ఓ పొరబాటు చేశారు. ఓటును రిజిస్టర్ చేసుకునే సమయంలో తనను తాను ఓ మహిళగా పేర్కొన్నాడు. 2009లో ఈ ఓటును రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అంటే ఎనిమిదేళ్లుగా కుష్నర్ మహిళగానే తన ఓటుహక్కును వినియోగించుకుని ఉంటారు. న్యూయార్క్ స్టేట్ బోర్డ్ ఎలక్షన్స్ రికార్డుల్లో కుష్నర్ జెండర్ పక్కన మహిళ అని ఉండటంతో ఈ విషయాన్ని స్థానిక మీడియా వెలుగులోకి తెచ్చింది. దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది.








