రష్యాతో ట్రంప్ ఒప్పందం వాస్తవమే
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత ఎన్నికల సందర్భంగా రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవమేనని ఇందులో ఎటువంటి సందేహం లేదని మాజీ ఎఫ్బిఐ డైరెక్టర్ జేమ్స్ క్యారీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్రంప్, మాజీ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లైన్పై జరుగుతున్న ఎఫ్బిఐ దర్యాప్తులను సత్వరమే మూసేయాలంటూ అధ్యక్షుడు ట్రంప్ తనని కోరిన మాట వాస్తవమేనని అన్నారు. 2016 అధ్యక్ష ఎన్నికలలో విజయం తదుపరి తనని తొలగించడంతో పలు వాస్తవాలను వెనక్కి నెట్టాలని భావించి ఉంటారని అన్నారు. దేశ అధ్యక్షుడితో మాట్లాడిన వివరాలు ప్రజలకు చెప్పడం నేరమెలా అవుతుందని, నేను ప్రత్యేక న్యాయవాది ద్వారా తన ఉద్దేశాలను వెల్లడించాలనుకోవటం తప్పుగా చూడటమేంటని ప్రశ్నించారు. 2013లో ఎఫ్బిఐ డైరెక్టర్‌గా నియమించిన తదుపరి అధ్యక్షుడితో కల్సి ఆనందంగా పనిచేయాలనుకున్నానని వెల్లడించారు. మరోవైపు కామేని బైటకు పంపడం ద్వారా ట్రంప్ లేని తలనొప్పి తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. కామే గత కొంత కాలంగా మౌనంగా ఉన్నా అతని సహచరులు మాత్రం ట్రంప్‌తో అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధమైనట్లు తెలియ వచ్చింది.













