జేమ్స్ బాండ్ మూర్ ఇకలేరు
జేమ్స్‌బాండ్ ఫేమ్ సర్ రోజర్ మూర్(89) మంగళవారం కన్నుమూశారు. గత కొద్దికాలం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన స్విట్జర్లాండ్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు మూర్ ట్వీటర్ అకౌంట్ ద్వారా మూర్ తనయుడు ట్వీట్ చేశారు. ఆఖరి రోజుల్లో మూర్ తమతో గడపడం వల్ల ఆయనకు తమపై ఉన్న ప్రేమ తెలిసిందని చెప్పారు.








