అమెరికా ఆర్మీలో మనోడికి రూ.1.2 కోట్ల ప్యాకేజీ!
భారతీయులకు అమెరికా సైన్యంలో ఉద్యోగం రావడం అంటేనే విచిత్రం అనుకుంటే, అది కూడా కళ్లు తిరిగే ప్యాకేజీ వచ్చింది. జైపూర్‌కు చెందిన మోనార్క్ శర్మ అనే వ్యక్తికి యూఎస్ ఆర్మీకి చెందిన ఏహెచ్ -64 ఈ కంబాట్ ఫైటర్ హెలికాప్టర్ యూనిట్లో సైంటిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. ఏడాదికి అతని జీతం రూ.1.2 కోట్లు కావడం విశేషం. ఈ ఏడాది యూఎస్ ఆర్మీలో చేరిన ఫైటర్ హెలికాప్టర్ల డిజైన్, పర్యవేక్షణ, తయరీ, నిర్వహణ బాధ్యతలను మోనార్క్ చూసుకోవాల్సి ఉంటుంది. 2013లో నాసాలోని మాస్ కమ్యూనికేషన్ వింగ్‌లో మోనార్క్ శర్మ జూనియర్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత మే 2016లో యూఎస్ ఆర్మీలో చేరాడు. కాప్టర్ల డిజైనింగ్, పరిశోధనతో తన మార్క్ చూసిన మోనార్క్, ఈ ఏడాది కాలంలో రెండు ప్రతిష్టాత్మక ఆర్మీ అవార్డులు కూడా అందుకున్నారు. మోనార్క్ శర్మ జైపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. అతని తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. నిజానికి ఇండియన్ ఆర్మీకి తాను సేవలు చేయాలని భావించినా అది కుదరలేదని, యూఎస్ ఆర్మీలో పని చేసి ఇండియాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని భావిస్తున్నట్లు శర్మ తెలిపారు.













