మిల్పిటాస్లో జగదీష్ ప్రభల మీట్ అండ్ గ్రీట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో బోర్డ్ డైరెక్టర్ పదవికి పోటీ పడుతున్న జగదీష్ ప్రభలతో మిల్పిటాస్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. స్వాగత్ రెస్టారెంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో జయరామ్ కోమటితోపాటు తానా అభిమానులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ ప్రభల మాట్లాడుతూ, తానాలో ఎన్నో ఏళ్ళుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ఆ అనుభవంతో ఈసారి డైరెక్టర్ పదవికి పోటీపడుతున్నట్లు చెప్పారు. తనను గెలిపించాల్సిందిగా అందరినీ ఆయన కోరారు. హేమారావు నందిపాటి, రజనీకాంత్ కాకర్ల తదితరులు పాల్గొన్నారు.













