మెలానియాకు కాశ్మీర్ శాలువ…
అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం అర్థరాత్రి ఒంటిగంట తరువాత వైట్ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ చేతులు కలుపుతూ మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమెరికా ప్రథమ మహిళా మెలానియి ట్రంప్ కూడా మోదీని స్వాగతించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు, తొలి మహిళ ఘనమైన స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు, ఇది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అన్నారు. ఈ సందర్భంగా మోదీ అమెరికా తొలి మహిళ మెలానియాకు కాశ్మీర్లో చేతితో రూపొందించిన శాలువా, హిమచల్ ప్రదేశ్‌లో రూపొందించిన వెండి బ్రాస్లెట్ను బహుమతిగా అందించారు. అలాగే ట్రంప్‌కు అబ్రహం లింకన్ మరణించిన తరువాత 1965లో జారీ చేసిన ఒక పోస్టల్ స్లాంపును అందించారు. దీనితోపాటు పంజాబ్‌లోని హోషియార్ పూర్లో కలపతో అందంగా తీర్చిదిద్దిన పెట్టెను బహుకరించారు. అలాగే ట్రంప్ కూడా మెదీకి లింకన్‌కు చెందిన ప్రఖ్యాత స్పీచ్ కాపీనీ, దానిని రాసుకునేందుకు వినయోగించిన డెస్క్‌ను చూపించారు.








