డొనాల్డ్ ట్రంప్ కూతురికి కీలక పదవి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన పెద్ద కూతురు ఇవాంకా ట్రంప్(35)కు పదవి కట్టబెట్టారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌కు ప్రత్యేక అసిస్టెంట్‌గా ఇవాంకాను నియమించారు. ఈ నియామకంతో ఆమె అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగి అయ్యారు. వైట్‌హౌస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇవాంకా భర్త కుష్నెర్ను ట్రంప్ ఇదివరకే తనకు సీనియర్ సలహాదారుగా నియమించారు. ఇవాంక తన భర్తతో కలసి వైట్‌హౌస్‌లో ట్రంప్‌కు విధుల్లో సహకరించనున్నారు. ట్రంప్ ప్రభుత్వంలో కుష్నెర్, ఇవాంకా ఇకనుంచి అధికారిక పాత్ర పోషించనున్నారు. తన తండ్రికి సలహాదారుగా సేవలందించాలని యోచిస్తున్నట్లు ఇవాంకా ఇటీవల చెప్పారు. తన భర్త కుష్నెర్కు చెందిన వెస్ట్ లింగ్ అప్స్టెయిర్స్లో ఆమెకు కార్యాయలం ఉంది. కాగా ఇవాంకా నియామకంపై విమర్శలు వస్తున్నాయి. వీటిపై ఇవాంక స్పందిస్తూ తాను వేతనం తీసుకోకుండా వైట్‌హౌస్‌లో సేవలందిస్తానని, ఇతర ఉద్యోగులకు వర్తించే నిబంధనలు తనకూ ఉంటాయని సృష్టం చేశారు.













