అమెరికన్ ప్రజల మంచి కోసమే…
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనా వ్యవహారాలలో జోక్యం పై మీడియాలో భిన్న కథనాలు రావడంపై కూతురు ఇవాంకా ట్రంప్ స్పందించారు. పాలనావ్యవహారాలలో తగిన సలహాలు ఇవ్వడాన్ని తప్పుబట్టడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. వేరే వ్యక్తులు ఎవరైనా తనకంటే భిన్నంగా ఏమైనా.. ఏంచేయాలనుకుంటున్నారో చెప్పాలని విమర్శకులను సూటిగా ప్రశ్నించారు. తాను చేసే ప్రతిపని అమెరికన్ ప్రజల మంచి కోసమేనని పోను పోనూమీకే తెలుస్తుందని ఇవాంకా పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పెద్ద కూతురు ఇవాంకా జీతం తీసుకోకుండా తండ్రికి ఇవాంకా సలహాదారుగా పనిచేస్తున్నట్లు ఇటీవల వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఆమె భర్త జేర్డ్ కుష్నర్ కూడా జీతం తీసుకోకుండా ట్రంప్‌కు సీనియర్సలహాదారుడిగా పనిచేస్తున్నారు.













