నోకియా, సిస్కో కంపెనీలతో కేటీఆర్ భేటీ
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. నోకియా, సిస్కో, ఎరిక్సన్ కంపెనీలతో ఆయన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ హస్త కళలు, చేనేత ఉత్పత్తులను బహుకరించారు. చేనేత, హస్త కళలకు తమ ప్రభుత్వం గత వైభవాన్ని తీసుకు వచ్చేందుకు తెలంగాణ అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.








