మహేశ్ భగవత్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం
మహిళల అక్రమ రవాణాను అరికట్టడానికి 13 ఏళ్లుగా కృషి చేస్తున్న రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌ను ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. ట్రాఫికింగ్ ఇన్‌పర్సన్ రిపోర్టు హీరో అవార్డు-2017కు ఆయన ఎంపికైనట్లు అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్, అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు తనకు సమాచారం అందిందని మహేశ్ భగవత్ తెలిపారు.








