వాషింగ్టన్ డిసిలో ఇన్వెస్టర్ల సదస్సు
భారత్ అమెరికా మైత్రీబంధం మరింత పటిష్టంగా కొనసాగుతుందని, ఎంపికచేసిన పెట్టుబడుల సదస్సును వాషింగ్టన్ డిసి లో వచ్చే నెల 18-20 తేదీలమధ్య నిర్వహిస్తామని అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రిన్సిపల్ కమర్షియల్ అధికారి జాన్ఫ్లెమింగ్ వెల్లడించారు. ఎఫ్ ట్యాప్పీ ఆధ్వర్యంలో అమెరికాలో పెట్టుబడుల అవకాశాలు అన్న అంశం పై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత వాణిజ్య పారిశ్రామికరంగాల్లో భారీ మార్పులు వచ్చాయని రవీంద్రమోడీ వెల్లడించారు. కొత్తయుగానికి నాంది పలికినట్లయిందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పరిశ్రమలస్థాపనకు ఈ సదస్సు ఉపకరిస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులకు దోహదం చేసే సదస్సు వచ్చె నెలలో జరుగుతుందన్నారు. అమెరికాలో వాణిజ్యబంధం మరింత వృద్ధి చేసుకోదలిచిన ఇన్వెస్టర్లకు ఈ సదస్సు ప్రయోజనకారి అవుతుందన్నారు. ఎఫ్ట్యాప్సీ అధ్యక్షుడు రవీంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అమెరికా సెలెక్ట్ యుఎస్ఎ లీడ్ రాహుల్ పద్మనాభన్, ఎఫ్ట్యాప్సీ అంతర్జాతీయ వాణిజ్య కమిటీ చైర్మన్ అనిల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.








