స్విమ్ సూట్ లో డొనాల్డ్ ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించేనా మీరు మాట్లేదని అంటారు. అవును ఆయన గురించే. కాని, ఆయన స్విమ్ సూట్ వేసుకోలేదు. ఆయన ఫోటోనే స్విమ్ సూట్ పై వేశారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ స్విమ్ సూట్ కంపెనీ ఇలా, ట్రంప్ ఫేస్ తో స్విమ్ సూట్‌ను తయారు చేసింది. ఆ స్విమ్ సూట్ కు ఓ పేరు కూడా పెట్టారు. దాని పేరు షాక్డ్ ట్రంప్. దీని ధర 49.95 డాలర్లు. ఒకసారి కొంటే ఎక్స్ చేంజ్ గాని, రిటర్న్ చేయడానికి అవకాశం లేదట. వీటిని తయారు చేసింది కూడా అమెరికాలోనేనట. అయితే ట్రంప్ స్విమ్ సూట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఈ కంపెనీ మే లో హెయిరీ చెస్ట్ అనే ఓ స్విమ్ సూట్ ను తయారు చేసింది. ఆ స్విమ్ సూట్ పై ఒంటి మీద వెంట్రుకలు ఉన్న ఓ వ్యక్తి చెస్ట్ ను ప్రింట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మళ్లీ ట్రంఫ్ పేస్‌తో టాక్ ఆప్ ది టౌన్ అయింది.













