మేం గెలిచామంటున్న వైట్‌హౌజ్
భారతీయ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ పది వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. ఇన్ఫోసిస్ ప్రతిపాదనపై వైట్‌హౌస్ ప్రతినిధి నినియో ఫెటల్వో స్పందించారు. ఇన్ఫోసిస్ చేసిన ప్రకటనను రాజకీయ విజయంగా భావిస్తున్నట్టు వైట్‌హౌజ్ పేర్కొన్నది. ట్రంప్ విధానాల వల్ల విదేశీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాయనడానికి ఇదే నిదర్శమని వైట్‌హౌజ్ ప్రతినిధి వెల్లడించారు. అమెరికా ఆర్థిక రంగాన్ని ఓ అవకాశంగా భావిస్తున్న ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలను స్వాగతిస్తున్నట్లు నినియో ఫెటల్వో తెలిపారు. ఇన్ఫోసిస్ మొత్తం నాలుగు హబ్స్‌ను అమెరికాలో ఏర్పాటు చేయనున్నది. ఆగస్టులో ఇండియానాపోలీస్‌లో మొదటి హబ్‌ను ప్రారంభిస్తారు.













