వీసా కేసులో ఇన్ఫోసిస్ సెటిల్మెంట్
ఐటీ దిగ్జజ సంస్థ ఇన్ఫోసిస్ వీసా కేసులో సెటిల్మెంట్కు అంగీకరించింది. న్యూయార్క్‌కు చెందిన వీసా కేసులో సుమారు పది లక్షల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించేందుకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. వీసా కేసులో తాము ఎటువంటి తప్పు చేయలేదని సంస్థ పేర్కొన్నది. పన్నుకు సంబంధించిన పేపర్‌వర్క్‌లో లోపాలు ఉన్నట్లు ఆ సంస్థపై ఆరోపణలు వచ్చాయి. అయితే వీసా కేసును మూసివేస్తున్నట్లు న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎరిక్ షిండర్మాన్ తెలిపారు. కేసును రద్దు చేసేందుకు పది లక్షల డాలర్ల సెటిల్మెంట్ కుదిరిందని ఆయన ప్రకటించారు. రెండు పార్టీల మధ్య 2013 ప్రకారమే ఒప్పందం కుదిరిందని ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో పేర్కొన్నది.








