ఫార్చ్యూన్ మహిళా జాబితాలో ఇంద్రనూయి, చంద కొచ్చర్
అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్ ఫార్చూన్ తాజాగా విడుదల చేసిన అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో భారత్‌కు చెందిన చంద్రా కొచ్చార్, శిఖా శర్మల పేర్లు జతచేర్చింది. అలాగే యుఎస్ జాబితాలో టాప్ త్రీ లిస్టులో ఇంద్రనూయి పేరు జతచేర్చింది. యుఎస్‌కు బయట ఉన్న మహిళా వ్యాపారవేత్తల జాబితాలో బాన్కో సన్టాడర్ గ్రూప్ ఎగ్జిక్యూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనా బోతిన్ టాప్ ప్లేస్‌ను దక్కించుకోగా, ఐసీఐసీఐ బ్యాంకు చెందిన కొచ్చార్ 5వ స్థానంలో, యాక్సిస్ బ్యాంకుకు చెందిన శర్మ 21వ ర్యాంకులో నిలిచారు.








