రోబోటిక్ లో భారత విద్యార్థుల ఘనత
అమెరికాలో నిర్వహించిన తొలి రోబోటిక్ ఒలింపియాడ్‌లో భారత విద్యార్థుల బృందం రెండు అవార్డులు గెలుచుకుంది. వాషింగ్టన్లో మూడు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ పోటీల్లో 157 దేశాల విద్యార్థులు పాలుపుంచుకొన్నారు. ముంబయికి చెందిన 15 ఏళ్ల రాకేశ్ నేతృత్వంలోని బృందం వీటికి హాజరైంది. విద్యార్థులు ఆదివ్ షా, హరీశ్ భట్, వాట్సిన్, ఆధ్యన్, తేజస్, రాఘవ్‌లు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. వీరు అభివృద్ధిచేసిన షెంగ్ హెంగ్ ఇంజినీరింగ్ డిజైన్‌కు బంగారు పతకం, గ్లోబల్ ఛాలెంజ్ మ్యాచ్ డిజైన్‌కు కాంస్య పతకం వచ్చాయి.








