అమెరికాపై విశ్వాసం కోల్పోతున్న భారతీయులు!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఆ దేశ నాయకత్వంపై భారతీయుల్లో విశ్వాసం క్షీణించిందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇదే ధోరణి కనిపిస్తోందని, ట్రంప్‌ను అహంకారిగా, ప్రమాదకారిగా చాలామంది భావిస్తున్నారని వెల్లడించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా పట్ల రష్యావాసుల దృక్పథంలో మాత్రం సానుకూలత పెరిగిందని తెలిపింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న వ్యూ పరిశోధన కేంద్రం 37 దేశాల్లో తాజా అధ్యయనాన్ని నిర్వహించింది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అగ్రరాజ్య నాయకత్వంపై భారతీయుల్లో నమ్మకం 18 పాయింట్లు తగ్గిందని ప్యూ నివేదిక వెల్లడించింది. అధ్యయనంలో పాల్గొన్న భారతీయుల్లో 40 శాతం మంది ట్రంప్‌పై విశ్వాసం వ్యక్తం చేశారని, ఒరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ విలువ 58 శాతంగా ఉండేదని పేర్కొంది.













