న్యూజెర్సీ హత్యల కేసులో కొత్త కోణం
న్యూజెర్సీలో జరిగిన శశికళ, అనీష్ సాయి హత్యల కేసులో కొత్త కోణం బయటపడింది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న అల్లుడు నర్రా హనుమంతరావే తమ కుమార్తె, మనుమడిని చంపించాడని శశికళ తల్లిదండ్రులు సుంకర వెంకటేశ్వరరావు, కృష్ణకుమారి ఆరోపించారు. విజయవాడ పోరంకిలోని లక్ష్మీనగర్‌లో ఉంటున్న వీరు తమ కుమార్తె, మనుమడి హత్యల గురించి తెలిసినప్పటినుంచీ కన్నీరుమున్నీరవుతున్నారు. తమ అల్లుడు నర్రా హనుమంతరావుకు అమెరికాలో మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, అందువల్ల అతడే తమ కూతురిని, మనవడిని హతమార్చి కట్టుకథలు చెబుతున్నాడని ఆరోపించారు.













