యూఎస్‌లో మరో దారుణం
అమెరికాలో భారతీయుడిపై దాడి జరిగింది. వాషింగ్టన్ డీసీలో తెలుగు యువకుడు సందీప్‌పై ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు నల్లజాతి యువకులు దాడికి పాల్పడ్డారు. సందీప్ నుంచి సెల్ఫోన్లు, పర్సు, నగదును వారు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. దుండగులు అటకాయించగానే వారు దోపిడీకి వచ్చినట్లు గమనించిన సందీప్ మారు మాట్లాడకుండా తన దగ్గరున్న అన్ని వస్తువులు ఇవ్వడంతో వారు వెళ్లిపోయారు. లేకుంటే తనను హత్య చేసి ఉండేవారని ఘటన అనంతరం పోలీసులకు సందీప్ తెలిపారు. మాస్క్‌లు ధరించి వచ్చిన యువకులు ఎవరన్న విషయమై విచారణ జరుపుతున్నామని వాష్టింగ్టన్ ఫెడరల్ పోలీసు వర్గాలు వెల్లడించాయి.








