అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య
అమెరికాలో 26 ఏళ్ల భారత సంతతి వ్యక్తి తన సోదరుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. డ్రైవర్‌గా పనిచేసిన శరణ్‌జిత్ సింగ్ 2013లో అమెరికాకు వెళ్లాడు. తన కజిన్ సోదరుడు లవ్‌దీప్ సింగ్(24)తో కలిసి క్వీన్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 26న సోదరుల మధ్య వివాదం తలెత్తడంతో లవ్‌దీప్ సింగ్, శరణ్జిత్పై కత్తితో దాడి చేశారు. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. సోదరుడిని హత్యచేసినట్లు లవ్జీత్ అంగీకరించాడని విచారణ అధికారులు వెల్లడించారు. అయితే ఈ హత్య వెనుకాల గల కారణాలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. శరణ్‌జిత్ తల్లిదండ్రులు భారత్‌లోనే ఉన్నారు. లవ్జీత్కు 25 సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.













