అమెరికాలో మరో ప్రవాస భారతీయుడు మృతి
అమెరికాలోని కాలిఫోర్నియాలో రైలు ఢీకొని కిర్టీ కపూర్(46) అనే ప్రవాస భారతీయ న్యాయవాది మరణించారు. వాట్కిన్స్ ఎవెన్యూ క్రాసింగ్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన కపూర్ ఢిల్లీలో ఎల్ఎల్బీ చదివారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.








