భారత్‌కు తిరిగి వెళ్లిపో!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు జాత్యాహంకారంతో రెచ్చిపోయారు. భారత సంతతికి చెందినో కంపెనీ సీఈవోను గో బ్యాక్ టూ ఇండియా అంటూ జాతి విద్వేష వ్యాఖ్యలతో అవమానించారు. రావిన్ గాంధీ అమెరికాలో జీఎంఎం నాన్‌స్టిక్ కోటింగ్స్ కంపెనీ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. వర్జీనియా హింసాకాండలో శ్వేతజాతీయులను వెనుకేసుకొచ్చిన ట్రంప్ వైఖరిని తప్పుబడుతూ ఓ ప్రతిలో వ్యాసం రాశారు. ట్రంప్ ఆర్థిక ఎజెండాను కూడా తూర్పారబట్టారు. దీన్ని జీర్ణించుకోలేని ట్రంప్ అభిమానులు రావిన్ను దూషిస్తూ కామెంట్లు చేశారు. భారత్ వెళ్లిపోవాలని హూంకరించారు.








