హెచ్-1 బి వీసాలపై ఆధారపడలేదు
భారత ఐటి సంస్థలు తమ వ్యాపారం కోసం హెచ్-1బి వీసాలపై అధికంగా ఆధారపడుతున్నాయన్న అభిప్రాయం సరైంది కాదని ఇన్ఫోసిస్ సంస్థ సిఇఓ విశాల్ సిక్కా పేర్కొన్నారు. తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను చేర్చుకునేందుకు వీసా నిబంధనలను దుర్వినియోగం చేస్తున్న సంస్థలపై అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని సృష్టం చేశారు. సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగంలో వేగవంతంగా మారుతున్న పరిస్థితులను తట్టుకుని అంతర్జాతీయ మార్కెట్లో భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీల ద్వారా లభిస్తున్న అవకాశాలను పెద్ద మొత్తంలో అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత ఐటి సంస్థలు తమ వ్యాపార అభివృద్ధి కోసం హెచ్-1బి వీసాలపై అధికంగా ఆధారపడుతున్నాయని అనుకోవడం సరికాదు. ఈ అభిప్రాయంంలో ఏమాత్రం నిజం లేదని అన్నారు.








