హెచ్-1 బీ వీసాకు ఇన్ఫోసిస్ రాం రాం….
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ హెచ్ 1బి వీసాలకు గుడ్‌బై చెప్పేసింది. హెచ్-1బీ వీసాలను ఆఫర్ చేస్తూ, ఈ సంవత్సరం అమెరికాకు కొత్తగా ఎవరినీ పంపరాదని, జూనియర్ ఉద్యోగులకు హెచ్-1బీ వీసాలకు దరఖాస్తులు చేయరాదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వీసా నిబంధలను కఠినం చేస్తూ, అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇందుకు కారణం. కనీసం నాలుగేళ్ల పాటు అనుభవం లేనిదే వర్క్ వీసాలకు దరఖాస్తు చేయరాదని ఇన్ఫీ నిర్ణయించింది. ఇకపై ఇండియాలోనే ఎక్కువ పని ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఇతర దేశాల వ్యాపారాలను సైతం ఇక్కడికే తీసుకువచ్చేందుకు క్లయింట్లతో చర్చలు జరుపుతున్నాయని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.













