సీమావర్మపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల జల్లు
వైద్య సంరక్షణ, వైద్య సహాయ సేవల కేంద్రాల అధిపతిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఇండో అమెరికన్ సీమావర్మపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ఒబామా కేర్ పథాకాన్ని తొలగించి ఆ స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావడంలో సీమా కీలక పాత్ర పోషించారు. తాజా పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారని ట్రంప్ తెలుసుకున్నారు. దీంతో ఈ పథకాన్ని అమలు చేయడంలో విశేష కృషి చేస్తున్న సీమాను ఆయన అభినందించారు. శ్వేతసౌధంలో సీమావర్మ అధ్యక్ష తన నిర్వహించిన ఉమెన్ ఇన్ హెల్త్‌కేర్ ప్యానెల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీమా తన ఆలోచనలను ట్రంప్‌కు వివరించారు. ఈ పథకంలో ఎక్కువ మంది స్రీలను సభ్యులుగా ఎంచుకున్నట్లు ఆమె చెప్పారు. ఒబామా కేర్ పథకం ద్వారా అవకాశాలు తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉండటంతో డాక్టర్లు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. సమావేవంలో పాల్గొన్న డాక్టర్లు, నర్సులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ మహిళా డాక్టర్ల వల్లే అమెరికా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు.













