నొప్పి లేకుండా గర్భాశయ కేన్సర్ నిర్ధారణ
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుక ఇకపై నొప్పి పుట్టించే పరికరాలను వినియోగించాల్సిన అవసరం లేదు. నార్త్ కరోలినాలోని డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక బృందం ఇందుకోసం ఓ ప్రత్యేక పరికరాన్ని అభివృద్ధి చేసింది. భారతీయ అమెరికన్ పరిశోధకురాలు నిమ్మి రామానుజన్ తాజా ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించారు. పాకెట్ కొల్పోస్కాప్గా పిలిచే ఈ పరికరం చేతితో పట్టుకునేందుకు అనువుగా ఉంటుంది. ల్యాప్టాప్, చరవాణులకు అనుసంధానించడం ద్వారా దాన్ని మహిళలు స్వయంగా ఉపయోగించుకోవచ్చు. పరికరానికి ఒక చివరన కాంతి జనకాలు, కెమరా ఉంటాయి. నొప్పి పుట్టించకుండా కోల్పోస్కాప్ను లోపలికి పంపించడం ఈ పరికరంతో వీలవుతుంది. తద్వారా క్యాన్సర్ తీవ్రతను తెలుసుకునేందుకు అవసరమైన చిత్రాలను కోల్పోస్కోప్ సృష్టంగా సేకరిస్తుంది.













