భారత సంతతి అమెరికన్ దంపతుల భారీ విరాళం
హార్వే తుపాను సహాయ కార్యక్రమాలకు భారత సంతతికి చెందిన అమెరికా దంపతులు సుమారు రూ.కోటి 62 లక్షల పై చిలుకు మొత్తాన్ని విరాళంగా అందచేశారు. హార్వే తుపాను సహాయ కార్యక్రమాల నిమిత్తం హ్యూస్ట్ మేయర్స్ నిధికి వారు ఈ మొత్తాన్ని ఇచ్చారు. హ్యూస్టన్ నివాసులైన అమిత్భండారీ, ఆయన భార్య అర్పితా బ్రహ్మభట్ భండారీలు ఈ మెత్తాన్ని గ్రేటర్ హ్యూస్టన్ కమ్యూనిటీ ఫౌండేషన్ తరపున అందజేశారు.








