తొలిసారి అమెరికా నుంచి భారత్‌కు చమురు
చమురు దిగుమతిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశమైన భారత్ తొలిసారిగా అమెరికా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నది. అక్టోబర్ నాటికి ఈ చమురు భారత్‌కు చేరుకోనున్నది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయిన వారం రోజుల తర్వాత ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఉత్తర అమెరికా నుంచి 20 లక్షల బ్యారెల్ల క్రూడాయిల్‌ను, 16 లక్షల బ్యారెల్ల యూఎస్ మార్స్ క్రూడ్, 4 లక్షల బ్యారెల్ల పశ్చిమ కెనడా నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు ఐవోసీ డైరెక్టర్ (ఫైనాన్స్) ఏకే శర్మ తెలిపారు. అమెరికా నుంచి చమురును దిగుమతి చేసుకోవడానికి అత్యధిక స్థాయిలో నిధులు వెచ్చించాల్సి వస్తున్నదన్నారు. మరో ప్రభుత్వరంగ సంస్థ భారత్ పెట్రోలియం పది లక్షల బ్యారెల్ల క్రూడాయిల్‌ను కొనుగోలు చేసింది. వచ్చే నెల 16న కానీ లేదా సెప్టెంబర్ 5న లోడింగ్ కానుండగా, భారత్‌కు సెప్టెంబర్ 26-అక్టోబర్ 15న రానున్నది.








