నేపర్ విల్లేలో ఇండియా డే
ఇల్లినాయిలోని నేపర్విల్లేలో ఇండియా డే వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆగస్టు 13వ తేదీన ఈ వేడుకలు జరిగాయి. దాదాపు 20,000మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇల్లినాయి గవర్నర్ బ్రూస్రౌనర్, మేయర్ స్టీవ్ చిరికో, షుంబర్గ్ ట్రస్టీ నిమిషన్ జాని తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బిజినెస్ సంస్థలు, కల్చరల్ ఆర్గనైజేషన్లు, ఆధ్యాత్మిక సంస్థలు ఈ సందర్భంగా శకటాలను ఏర్పాటు చేశాయి.






