భారత్, అమెరికా సైన్యాల సంయుక్త విన్యాసాలు
భారత్, అమెరికా సైన్యాలు వార్షిక సంయుక్త యుద్ధ విన్యాసాలకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 14 నుంచి 2 వారాల పాటు వాషింగ్టన్లో ఇవి కొనసాగనున్నాయి. ఆసియాఫసిఫిక్ ప్రాంతంలో ఉత్తరకొరియా అణు పరీక్షలు, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యానికి చైనా యత్నిస్తున్న సమయంలో నిర్వహిస్తున్న రెండు దేశాల యుద్ద అభ్యాసాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకరి సైనిక విధానాలను మరొకరు తెలుసుకోవటంతో పాటు అనూహ్యమైన పరిస్థితుల్లో సంయుక్తంగా యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చినప్పుడు 2 దేశాల సైనిక వ్యవస్థల సమన్వయం సాధనకు ఈ విన్యాసాలు ఉపకరిస్తాయని భారత సైనిక వర్గాలు తెలిపాయి.








