అమెరికా వీసాకు కొత్త రూల్
అమెరికా వీసాకు మరో కొత్త రూల్ ప్రకటించారు. అమెరికా వీసా కావాలంటే సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు, ఈమెయిల్, ఫోన్ నెంబర్లన్నీ తదితర వివరాలను వీరు పరిగణలోకి తీసుకుని వీసా జారీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటీసును ఫెడరల్ రిజస్టర్ వెల్లడించింది కూడా. ఉవ్రాద కార్యకలాపాలు జరుగుతున్నాయని అమెరికాకు అనుమానం ఉన్న కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు అత్యంత కఠినమైన తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు తేల్చిచెప్పారు. అయితే ఈ నిబంధన వల్ల కేవలం 0.5 శాతం మంది దరఖాస్తుదారులు అంటే 65వేల మంది మాత్రమే ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉందని యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ ప్రతినిధులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లిం దేశాల నుంచి వచ్చే వారిపై కొంతకాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ పాస్పోర్టు సంఖ్యతో పాటు ఐదేళ్లగా వాడుతోన్న సోషల్మీడియా ఖాతాలు, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లతో పాటు 15ఏళ్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని అందించాలి. సోషల్ ఖాతాలకు సంబంధించిన పాస్వర్డ్లను కౌన్సిలర్ అధికారులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కొత్త నిబంధనలకు ట్రంప్ వర్గం ఆమోదం తెలిపితే మే 18 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.








