ఐఎజిసి సమ్మర్ పిక్నిక్
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో సమ్మర్ పిక్నిక్కు ఏర్పాట్లు అంతా పూర్తయింది. వాకొండలోని లేక్వుడ్ ఫారెస్ట్ ప్రిజర్వ్లో జూన్ 25న జరిగే ఈ పిక్నిక్లో పాల్గొనేందుకు చాలామంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డ్యాన్స్, సింగింగ్, తంబాలా, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇతర వివరాలకోసం రాంభూపాల్ రెడ్డి కందుల 609 529 9159, గోపిరెడ్డి పిట్టల 224 587 9796, మనోజ్ కుమార్ 224 279 9272లో సంప్రదించవచ్చు.








