కరేబియన్ దీవుల్లో ‘ఇర్మా’ విలయం
అట్లాంటిక్ మహా సముద్రంలో పుట్టిన ‘ఇర్మా’ హరికేన్ కరేబియన్ దీవుల్లో విలయం తాడవం చేస్తోంది. యాంటిగువా, బర్బుడా, సెయింట్ మార్టిన్ వంటి దీవులు ఈ హరికేన్ ధాటికి కకావికలమై పోయాయి. వేర్వేరు దీవుల్లో పది మంది దుర్మరణం పాలయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు ప్రాంతాల్లో గంటకు 295 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ప్రళయ బీభత్సాన్ని సృష్టస్తోంది. దీంతో సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఇబ్బందిగా మారింది. ఇర్మాను అతి భయంకరమైన ఐదో కేటగిరీ హరికేన్‌గా అమెరికా జాతీయ హరికేన్ కేంద్రం ప్రకటించింది.













