ఫ్లోరిడా రాష్ట్రంలో అప్రమత్తత
కరేబియన్ దీవుల్లో హరికేన్ ఇర్మా బీభత్స తుపాను ఆదివారం ఉదయానికి అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని ‘ఫ్లోరిడా కీస్’ ప్రాంతాన్ని తాకవచ్చని అంచనావేస్తున్నారు. తీరాన్ని తాకే సమయంలో 25 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడవచ్చని, గంటకు 250 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని అమెరికా జాతీయ హరికేన్ విభాగం హెచ్చరించింది. ముందు జాగ్రత్తగా ఇప్పటికే ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంతాల నుంచి దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2005లో హరికేన్ కత్రినా తర్వాత ఇంత పెద్దస్థాయిలో ప్రజల్ని తరలించడం ఇదే మొదటిసారి.ఫ్లోరిడాతో పాటు జార్జియా రాష్ట్రంపై పెను ప్రభావం చూపవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది.













