యూఎస్ ఓపెన్ ఫైనల్ విజేత ప్రణయ్
యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టైటిల్‌ను భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ గెలుచుకున్నారడు. మరో భారత ఆటగాడు, తెలుగుతేజం కశ్వప్తో జరిగిన ఫైనల్లో 21-15, 20-22, 21-12 తేడాతో విజయం సాధించాడు. ఫలితంగా కెరీర్లో మూడో గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. హోరాహోరిగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి గేమ్‌ను ప్రణయ్ 21-15 తేడాతో గెలుచుకున్నాడు. తర్వాతి గేమ్‌లో పుంజుకున్న కశ్వప్ విరోచితంగా పోరాడి 22-20తేడాతో గెలిచాడు. నిర్ణయాత్మకమైన మూడో గేమ్‌లో ప్రణయ్ సునాయసంగా గెలుచుకొని యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్‌లో కొత్త విజేతగా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన టోర్నీలో మన దేశానికి చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో శ్రీకాంత్, సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్ ఫైనల్లో తలపడ్డారు.













