సంజన దుగ్గిరాల కు అవార్డు
అమెరికా ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘ప్రెసిడెన్షియల్ స్కాలర్-2017’ పురస్కారాన్ని సంజన దుగ్గిరాల దక్కించుకున్నారు. ఈ అవార్డుకు అమెరికా హైస్కూళ్ల నుంచి 161 మంది సీనియర్లు పోటీపడ్డారు. న్యూజెర్సీలోని ఈస్ట్విండ్సర్కు చెందిన ఆమె.. ట్రెంటన్లోని మెర్సర్ కౌంటీ టెక్నికల్ స్కూల్స్ విద్యార్థిని. వాషింగ్టన్ డీసీలో గత నెల 18-20 తేదీల మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో సంజన ఈ అవార్డు అందుకున్నారు.








