హెచ్-1బి వీసా వర్కర్ల జీతం పెంచాలి
హెచ్-1బి వీసాలపై పని చేసే విదేశీ వర్కర్ల కనీస వేతనాన్ని ఇప్పుడున్న 60 వేల డాలర్లనుంచి కనీసం 80 వేల డాలర్లకు పెంచాలని అమెరికా కార్మిక శాఖ మంత్రి అలెగ్జాండర్ అకోస్టా సూచించారు. అమెరికా వర్కర్ల స్థానంలో హెచ్-1బి వీసాలపై అమెరికాకు వచ్చే విదేశీ వర్కర్లను నియమించుకునే సమస్యకు దీనివల్ల చాలావరకు పరిష్కారం లభిస్తుందని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఓ కమిటీకి అకోస్టా చెప్పారు. ‘చాలాకాలంగా కాంగ్రెస్ ఆ 60 వేల డాలర్ల పరిమితిని పెంచలేదు. కేవలం ద్రవ్యోల్బణం దృష్ట్యా చూసినా ఈ మొత్తం 80 వేల డాలర్లకు పైగానే పెంచాల్సి ఉంటుంది. ఆ పని చేసినట్లయితే మీరు గుర్తించిన సమస్యల్లో చాలావాటికి అది పరిష్కారమవుతుంది. ఎందుకంటే చాలామంది ఆ 60 వేల డాలర్ల పరిమితికి దిగువనే ఉన్నారు’ అని అకోస్టా అమెరికా సెనేట్‌కు చెందిన కార్మిక, ఆరోగ్య, మానవ సేవలు, విద్య, సంబంధిత రంగాలకు సంబంధించిన ఉప సంఘం సభ్యులతో అన్నారు.













