ఫోర్బ్స్ జాబితాలో భారత్ కు స్ఠానం
ప్రపంచంలోనే అగ్రగామి 10 వినియోగదారు ఆర్థిక సేవల కంపెనీల్లో భారత్కు చెందిన ఒకే ఒక కంపెనీకి చోటు దక్కింది. అమెరికన్ ఎక్స్ప్రెస్కు అగ్రస్థానం దక్కగా, 8.1 బిలియన్ డాలర్ల విక్రయాలు, 1.6 బిలియన్ డాలర్ల లాభాలతో హెచ్డీఎఫ్సీకి ఏడో స్ధానం లభించిందని ఫోర్బ్స్ గ్లోబల్ లిస్ట్-2017 ప్రకారం తెలుస్తోంది. వరుసగా మూడో ఏడాది ఈ జాబితాలో హెచ్డీఎఫ్సీ స్థానం సంపాదించుకోవటం విశేషం. తాజా జాబితాలో క్యాపిటల్ వన్ ఫైనాన్షియల్, వీసాలకు వరుసగా రెండు, మూడో స్థానాలు దక్కాయి.








