డొనాల్డ్ ట్రంప్ వల్ల ప్రమాదంలో ప్రపంచం
పారిస్ వాతావరణ ఒప్పందంనుంచి అమెరికా తప్పుకోవాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం భూసమస్థితిని తీవ్రంగా ప్రభావితం చేయనుందని, భూమిని ఉష్ణగ్రహంగా మార్చేందుకు దారితీసే ప్రమాద ముందని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తెలిపారు. ట్రంప్ నిర్ణయం ఫలితంగా వెనక్కిరాలేని మార్పులకు భూవాతావరణం లోనవుతుందని భూమి శుక్రుడిలాగా ఉష్ట్రగ్రహంగా మారుతుందని, ఉష్ణోగ్రత 250 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని, సల్ఫ్యూరిక్ యాసిడ్ వర్షాలు కురుస్తాయని ఆయన హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. పారిస్ పర్యావరణ ఒప్పందంలో అమెరికా కొనసాగటం వల్ల ఆ దేశ వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలేమీ దెబ్బతినవని అన్నారు.













