హార్వార్డ్ విశ్వవిద్యాలయ ప్రవేశాల్లో భారతీయులపై వివక్ష
అమెరికాలోని హార్వార్డ్ విశ్వవిద్యాలయం భారతీయ, ఆసియా సంతతికి చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించటంలో జాతిపరమైన వివక్ష చూపుతుందని వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తునకు ట్రంప్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. భారత సంతతి అమెరికన్లు, ఆసియా-అమెరికన్లకు చెందిన 64 సంస్థలు 2015లో ఈ ఫిర్యాదులు చేయగా అప్పటి ఒబామా ప్రభుత్వం వీటిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. అయితే, తమ ప్రభుత్వం ఈ ఫిర్యాదు ఏవరేజ్ (జీపీఏ)ల్లో అత్యధిక మార్కులు సంపాదించినా, ఇతర కార్యక్రమాల్లో బహుమతులు పొందినా హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ఐవీ లీగ్ కాలేజీ వంటి సంస్థలు ప్రవేశాలను ఇవ్వలేదని, అదే సమయంలో ఇంతకన్నా తక్కువ స్థాయిలో ప్రతిభచూపిన ఇతర జాతుల వారికి ఇచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికీ ప్రాధాన్యం ఇవ్వాలన్న కారణంతో కొన్ని విద్యా సంస్థలు కేవలం ప్రతిభనే కాకుండా, ఇతర కోణాల్లోనూ ప్రవేశాలు కల్పిస్తున్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి.













