మూలకణ చికిత్సతో జుట్టు పెరుగుదల!
మారిన ఆహారపు అలవాట్లు, టెస్టోస్టిరాన్లో మార్పుల వల్ల పట్టుమని పాతికేళ్లయినా నిండకముందే నున్నటి బట్టతల వచ్చేస్తోంది. బట్టతలను నివారించడానికి ఇప్పటి దాకా ఉపశమనచర్యలు మాత్రమే ఉన్నాయి. కానీ, తాజాగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తలపై ఉన్న మూలకణాలను ఉత్తేజపరిచి జట్టు పెరుగుదలకు దోహదం చేసే సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. జుట్టులో జీవాణువులు చాలా కాలం బతికే ఉంటాయని, వాటిని ప్రేరేపిస్తే జుట్ట పెరగడానికి అవకాశం ఉందని తెలిపారు.








