హెచ్1బీ ఉద్దేశం అది కాదు
హెచ్1బీ వీసాల ఉద్దేశం విదేశీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్లను నియమించటం కాదని అమెరికా కార్మికమంత్రి అభ్యర్థి అలెగ్జాండర్ అకోస్టా తెలిపారు. ఆయన సెనేటర్లు అడిగిన ప్రశ్నలకు జావాబిస్తూ దేశంలో నైపుణ్యం గల ఉద్యోగుల కొరత ఉందని అంగీకరించారు. ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతున్నాయని కొందరు, విదేశీయులతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని మరికొందరు అమెరికన్లు భావిస్తున్నారని తెలిపారు. నిజానికి విదేశీ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలనీ అమెరికన్లకు చెబుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, హెచ్1బీ వీసాల ఉద్దేశం ఇది కాదన్నారు.







