భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్
హెచ్1బీ వీసా విషయంలో భారతీయులకు షాక్ ల మీద షాకులు ఇచ్చిన ట్రంప్ ప్రభుత్వం గూడ్ న్యూస్ చెప్పబోతుంది. ఉద్యోగ ఆధారితంగా ఇచ్చే గ్రీన్ కార్డులు, హెచ్ 1బీ వీసాల కఠినతరమైన నిబంధనల నుంచి సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమ్యాటిక్స ల్లో అమెరికా యూనివర్సిటీల నుంచి పీహెచ్డీ పొందిన విదేశీయులను మినహాయించాలని కోరుతూ ప్రతినిధుల సభలో మరోసారి ఓ బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సభ్యులు ఎరిక్ పాల్సన్, మైక్ క్విగ్లిలు లీవింగ్ ది ఎకానమీ యాక్ట్ (స్టాపల్) పేరుతో బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుతో భారతీయు విద్యార్థులు లబ్ది పొందనున్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో భారతీయ విద్యార్థులు అమెరికాలో పీహెచ్డీలు పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను అమెరికాకు తెచ్చుకోవడంలో ఎలాంటి సర్ ప్రైజ్ లేదని, ఇక్కడ ఎడ్కుకేట్, ట్రైన్ చెందిన విద్యార్థులు, అమెరికా ఆర్థిక వ్యవస్థకే ఉపయోగపడేలా తాము అన్ని చర్యలు తీసుకోనున్నట్లు కాంగ్రెస్ సభ్యుడు ఎరిక్ పాల్సన్ తెలిపారు.













