ద్రాక్షతో దంతాలకు ఎనలేని మేలు
దంతాలకు ద్రాక్ష ఎనలేని మేలు చేస్తుందట. వీటి గింజల్లో సహజ సిద్ధంగా లభించే సమ్మేళనాలు దంతక్షయాన్ని దూరం చేస్తాయట. అంతేకాదు ఎనామిల్ పొర కిందుండే డెంటిన్ కండరాలు పటిష్ఠమయ్యేందుకు తోడ్పడతాయట. అమెరికాలోని ఇల్లినాయిస్ వర్సిటీ నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. మన చర్మం, ఇతర కండరాల్లో కనిపించే కొల్లాజెన్ ప్రొటీన్ డెంటిన్ నిర్మాణంలో క్రియాశీల పాత్ర పోషిస్తుంది. వీటికి స్వీయ మరమ్మతులు చేసుకునే సామర్థ్యం వుంటుంది. అయితే దీనికి ఆలిగోమెట్రిక్ ప్రోయాథ్రోసైనిడిన్లుగా పిలిచే వృక్ష సంబంధిత ఫ్లేవనాయిడ్లు అవసరం. ఇది ద్రాక్ష గింజల్లో పుష్కలంగా లభిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీటి సాయంతో డెంటల్ ఫిల్లింగ్స్ కూడా తయారుచేయొచ్చని, ఇవి చాలా దృఢంగా ఉంటాయని పరిశోధకులు అన్నా బెడ్రాన్ రూసో తెలిపారు.













