వర్జీనియాలో తమ్మారెడ్డి భరద్వాజ మనవడి మృతి
ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మనవడు (కుమార్తె చరిత కుమారుడు) వెల్లంకి సాకేత్ రాం జూలై 3వ తేదీన మరణించారు. అంత్యక్రియలు జులై 5వ తేదీన అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం మనస్సాస్లో జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వెల్లంకి కుటుంబానికి ప్రవాసులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.








